హనుమకొండ, జనవరి 9 : ఆర్టీసీ దసరా ఆదాయం రూ.34.52 కోట్లు అర్జించింది. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు నడిపిన ప్రత్యేక బస్సులు నడిపించింది. వరంగల్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోలకు చెందిన హనుమకొండ, జనగామ, వరంగల్-1, వరంగల్-2, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, తొర్రూరు, భూపాలపల్లి డిపోల నుంచి అనుకున్న ఆదాయాన్ని మించిపోయింది. మొత్తం 63 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా ఇందులో 41 లక్షల మంది మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించారు.
టికెట్ ద్వారా రూ.22 లక్షలు మొత్తం రూ.34.52 కోట్లు ఆదాయం సమకూర్చినట్లు ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. ఆదివారం ఒక్కరోజే రూ.2 కోట్ల రాబడి వచ్చింది. ఉమ్మడి వరంగల్‌కు కేంద్రబిందువైన హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి ప్రతిరోజూ వందలాది బస్సులు నడుస్తుంటాయి. డిపోలవారిగా అనుకున్న టార్గెట్‌ను మించి ఆదాయాన్ని అర్జించింది. పండుగల సమయంలో ఆర్టీసీ అదనపు సర్వీసులను ప్రారంభించింది.
ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడంతో ఖజానా నిండింది. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకోవడంతో వరంగల్ ఆర్టీసీకి ఆదాయం భారీగా అర్జించింది. వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి అనుకున్న టార్గెట్‌కు అదనంగా ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, అధిక ఆదాయాన్ని అర్జించినట్లు ఆర్ఎం డి.విజయభాను తెలిపారు.