హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 6: శాసన మండలి సభ్యుడు చింతపండు నవీన్ కుమార్ (Teenmar Mallanna) కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. చింతపండు నవీన్ పై వెంటనే క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మల్లన్న బహిరంగ సభలో చేసిన ప్రసంగంలో రెడ్డి కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మనోభావాలను దెబ్బు తీశాయన్నారు.
చింతపండు నవీన్ ఒళ్లు చింతపండు అవుతుందన్నారు. రెడ్డి సమాజానికి భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డమాండ్ చేశారు. అతడి వ్యాఖ్యలు కులాల వారీగా ఘర్షణలకు దారితీసే విధంగా వున్నాయన్నారు. దమ్ము, ధైర్యము ఉంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్హుల కిషన్ రెడ్డి, రావుల నర్సింహా రెడ్డి, నల్ల రాజి రెడ్డి, జైహింద్ రెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, చింతల హరికృష్ణా రెడ్డి, కట్టా రఘుపాల్ రెడ్డి, రాధారపు సంజీవ రెడ్డి, పెద్ద ఇంద్రసేనా రెడ్డి, గొంగిడి ప్రభాకర్ రెడ్డి, మట్టా రాజ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.