ఉద్యమకారుల ఓదార్పు యాత్రను విజయవంతం చేయండి : గుడిమళ్ల రవికుమార్
నేటి నుంచి జరిగే ఉద్యమకారుల ఓదార్పు యాత్ర విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట అధ్యక్షుడు గుడిమళ్ళ రవికుమార్ పిలుపునినిచ్చారు.
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 16 : నేటి నుంచి జరిగే ఉద్యమకారుల ఓదార్పు యాత్ర విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట అధ్యక్షుడు గుడిమళ్ళ రవికుమార్ పిలుపునినిచ్చారు. బుధవారం హనుమకొండ కాకతీయకాలనీలోని ఉద్యమకారుల ఆఫీస్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 17న వరంగల్ నగరంలోని ఎస్బీహెచ్ పక్కనున్న తొలిదశ అమరవీరులు చుంచు చంద్రమౌళి, షైక్ ఫకీర్అలీ, ఆడెపు మార్కండేయ, గూడూరు వెంకటస్వామిల జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్మారక జెండా వద్ద అమరులకు నివాళులు అర్పించిన అనంతరం 1969 తొలిదశ ఉద్యమకారులు ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారన్నారు.
ఈ యాత్ర వరంగల్ రస్తా నుంచి హెడ్ పోస్టాఫీస్, అండర్ బ్రిడ్జి, శాకరాశికుంట, ఫోర్ట్ వరంగల్ పెట్రోల్ పంప్ నుంచి ఫోర్ట్ వరంగల్ తూర్పు, మధ్య, పడమరకోట నుంచి శివనగర్, చింతల్, అంతిమంగా గోవిందరాజులగుట్ట వద్ద ఉన్న ఉద్యమకారులను పరామర్శిస్తూ, ఓదారుస్తూ , భరోసా కల్పిస్తుందన్నారు. 18, 19, 20 తేదీల్లో వరంగల్ జిల్లాలో అమరుల, ఉద్యమకారుల ఇండ్లకువెళ్లి పలకరిస్తూ వారి సామజిక ఆర్ధిక స్థితిగతులు తెలుసుకుంటామని, ఈ వివరాలను రికార్డు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఓదార్పు యాత్ర తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా 33 జిల్లాలో సంవత్సరంపాటు కొనసాగుతుందని, ఉద్యమకారుల శాస్త్రీయ గణాంకాలు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామని తద్వారా నిజమైన ఉద్యమకారులను గుర్తించే వీలు కల్గుతుందన్నారు. క్రియాశీలకంగా ఉద్యమవిస్తృతికి పాటుపడిన ఉద్యమకారుల అందరిని గుర్తించి వారిని సముచితంగా గౌరవించడం గౌరవప్రదంగా ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఉద్యమకారుల ఓదార్పు యాత్రను ఉద్యమకారులందరూ పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉద్యమకారుడు షైక్ ఉస్మాన్అలీ, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉద్యమకారుడు బొలిశెట్టి అశోక్‌ను నియమిస్తూ నియామక పత్రాలు అండజేశారు. ఈ సమావేశంలో తొలిదశ ఉద్యమకారుల రాష్ర్ట కన్వీనర్ టీఎన్ స్వామి, తొలిదశ ఉద్యమకారులు కొండేటి నారాయణరెడ్డి, ఏ.తిరుపతిరెడ్డి, టం సమ్మయ్య, వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర ప్రచార కమిటీ సభ్యులు చాంద్‌పాషా, చెన్నూరి నటరాజ్, ఇమ్మడిశెట్టి రాజు, మేకల కృష్ణ, మాధవి లతా, మీడియా ఇంచార్జి రాంపెల్లి శ్రీనివాసచారి, ఓదార్పు యాత్ర వాలంటీర్స్ రాంకుమార్, గోపనబోయిన రాజు, మేకల రవీందర్, బారిగేలా కృష్ణమూర్తి, దార సూరి, దామెర సాగర్, ముగుసలా దేవేందర్‌రెడ్డి, ఎండి.అమ్జద్, పద్మ, స్వర్ణలతా, కిరణ్, చుంచు వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

