హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 10: కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ఆందోళన చేపట్టారు. వెంటనే తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే క్రమబద్దీకరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలని ఈ సందర్భంగా యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ కర్ణాకర్రావు, డాక్టర్ శ్రీధర్లోథ్కుమార్, డాక్టర్ కనకయ్య డిమాండ్ చేశారు. రాష్ర్టవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ ఒప్పంద అధ్యాపకులు సాధు రాజేష్, సతీష్, వీణ, ఆశీర్వాదం, అంజన్నరావు, గడ్డం కృష్ణ, ఆర్డి ప్రసాద్, కే.మధుకర్రావు, బిక్షపతి, లక్ష్మారెడ్డి, సునీత, సుజాత, సంగీత్, కుమార్, బ్లెస్సీ, ప్రియాంక, శ్రీలత, సుచరితపాల్, సత్యజూల, సదాశివ, నాగేశ్వరరావు, తూర్పాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.