హనుమకొండ చౌరస్తా, జూలై 14: కాకతీయ యూనివర్సిటీ, ప్రజా పాలనా శాస్త్రం, మానవ వనరుల నిర్వహణ శాస్త్రం విభాగాలకు విభాగాధిపతిగా ప్రొఫెసర్ శ్రీనివాసరావును నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కర్నాటి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావు ప్రస్తుత విభాగాధిపతి ఆకుతోట శ్రీనివాసులు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.
శ్రీనివాసరావు 18 సంవత్సరాల్లో యూనివర్సిటీ డిసేబుల్డ్ సెల్ డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్, యూనివర్శిటి కాలేజి వైస్ ప్రిన్సిపాల్‌గా, యూనివర్శిటి స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీగా, యూనివర్శిటీ హాస్టల్స్ డైరెక్టర్‌గా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాలకు హెడ్‌గా, బోర్ట్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా పనిచేసి ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2008 నుంచి 2018 వరకు అన్ని రకాల సెట్ల ఆఫ్ లైన్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్లకు వెరిఫికేషన్, చీఫ్ వెర్ఫికేషన్ ఆఫీసర్‌గా పనిచేశారు.