సుబేదారి(వరంగల్) : అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య, ప్రియుడు కలిసి సుఫారీ ఇచ్చి భర్తను చంపించన ఘటన కేసును వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. హనుమకొండ లోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఐదుగురి నిందితులను అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధి పరకాల టౌన్ కు చెందిన మడికొండ సుమన్ భరత్ కనబడడం లేదని తండ్రి సాంబయ్య పిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఊహించని విధంగా భార్య లావణ్యనే భర్తను చంపించినట్లు తేలింది.
లావణ్యకు పరకాలకు చెందిన ఇమ్మడి నరేష్ తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో భర్త సుమన్ భరత్ మద్యం సేవించి భార్య లావణ్యను హించినే వాడు. భర్త అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు నరేష్, ఆమె తమ్ముడు పెండల రాజు కలిసి భరత్ ను హత్య చేయడానికి ములుగు జిల్లా గోవిందారావు పేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేష్ తో సుఫారీ హత్యకు రూ.5లక్షలు డీల్ కుదుర్చుకొని రూ.4లక్షల,60 వేలు ఇచ్చారు.
ఏప్రిల్ 3 న వెంకటేశ్వర్లు, రాకేష్ మృతుడు భరత్ ను ములుగుకు పిలుపించుకున్నారు. ముగ్గురు మద్యం సేవించారు. అక్కడి నుంచి వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి, వెంకటేశ్వర్లు, రాకేష్ ఇద్దరు కలిసి భరత్ తల పై బీర్ బాటిల్ కొట్టి చంపి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. వీడియో తీసి లావణ్య ఫోన్ కు పంపించారు. భరత్ డెడ్ బాడీని కాల్చి, ఆనవాళ్లు లేకుండా బొక్కలను సమీపంలోని వాగులో పడేశారు. తరువాత లావణ్య రూ.40 వేలు వెంకటేశ్వర్లకు అందజేసినట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు.