Peaceful elections | హనుమకొండ చౌరస్తా, జూన్ 20: కాకతీయ విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల (నాన్ గెజిటెడ్ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల) సంఘాల ఎన్నికలు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రశాంతంగా ముగిసిన్నట్లు ఎన్నికల అధికారి, పరిక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు.
క్యాంపస్, సుబేదారి కాలేజీల, కొత్తగూడెం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, ఖమ్మం పి.జి.కాలేజీ ఉద్యోగులు పాల్గొన్నారని, ఈనెల 21(శనివారం) ఉదయం 11 విశ్వవిద్యాలయ సెనెట్హాల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగుల, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో నాల్గవ తరగతి ఉద్యోగుల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు.
నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో అధ్యక్ష పదవీకి బి.నవీన్‌కుమార్, జి.నిరంజన్, ఉపాధ్యక్ష పదవీకి మహమూద్ యూనస్, పి.భాస్కర్, జనరల్ సెక్రటరీ పదవీకి వి.తిరుపతి, సయ్యద్ అక్రం, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజింగ్) పదవీకి ఎ.సతీష్‌బాబు, బి.రాజు, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజింగ్ మహిళా) పదవీకి బి.కృష్ణ వేణి, ఘౌసియా బేగం, సీహెచ్.దేవమ్మ, జాయింట్ సెక్రటరీ (రిక్రియేషన్) పదవీకి జి.మధుకర్, టి.ప్రభాకర్, పి.సుశీల్, ట్రెజరర్ పదవీకి సీహెచ్.ప్రవీణ్‌కుమార్, టి. దామోదర్ బరిలో ఉన్నట్లు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘంలో అధ్యక్ష పదవీకి పి.గుమ్మయ్య, మెహమూద్ నిజాముద్దీన్, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజింగ్) పదవీకి మహేమ్మద్ వలిపాపా, టి. రాజేశ్వర్, జాయింట్ సెక్రటరీ (రిక్రియేషన్) పదవీకి ఎన్.ఐలయ్య, పి.వేణు, ట్రెజరర్ పదవీకి టి.తిరుమల్సింగ్, పి.రామనాధంలు బరిలో ఉన్నట్లు తెలిపారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా పి.శ్రీధర్ వ్యవహరించగా, వివిధ కళాశాల పోలింగ్ కేంద్రాలలో సహాయ రిజిస్ట్రార్లు పోలింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించిన్నట్లు, పర్యవేక్షలు కే.శ్రీనివాస్, నాన్ టీచింగ్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.