Caste census | కులగణనను నిబద్ధతతో చేపట్టాలి : పరికిపండ్ల అశోక్
ప్రపంచంలో ఏ గ్రూపుకు జరగని అన్యాయం 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో బీసీలకు జరుగుతుందని బీసీ ఉద్యమ నాయకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31 : కులగణన-2027 శాస్త్రీయంగా నిబద్ధతతో జరగాలని లేకపోతే బీసీలకు మరో దశాబ్ద కాలం తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని, ప్రపంచంలో ఏ గ్రూపుకు జరగని అన్యాయం 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో జరుగుతుందని బీసీ ఉద్యమ నాయకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ‘ఓపెన్ కాస్ట్ కాలం క్లోజ్డ్ జస్టిస్- ది ఇంజస్ట్రీస్ ఇన్ సెన్సెస్-2027’ అనే అంశంపై జరిగిన సమావేశంలో సెన్సెస్-2027లో బీసీలకు జరగబోయే అన్యాయం గురించి శాస్త్రీయంగా విశ్లేషించారు.
కులగణనలో ఓబీసీకి ప్రత్యేక స్థానం ఇవ్వాలని, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్.. శాస్త్రీయ డ్రాప్టాన్ విధానం అమలు చేయాలన్నారు. జాతీయ జనగణనలో కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించేందు కు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, కుల గణనను కేవలం ఓపెన్-ఎండెడ్ విధానంలో నిర్వహిస్తే ఒకే కులం వివిధ పేర్లు, పర్యాయపదాలు, ప్రాంతీయ మాండలికాలు, ఉపకులాల పేర్లతో నమోదు అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల తుది డేటాలో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని, 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జరిపిన సెన్సెస్‌లో ఇదే జరిగిందన్నారు.
మరొకసారి ఓబీసీలు అన్యాయం బారిన పడటానికి సిద్ధంగా లేరని వారు హెచ్చరించారు. భవిష్యత్తులో విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయ విధానాలకు ఈ డేటా కీలకం కాబట్టి కులాల నమోదు ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులు డాక్టర్ మియాపురం శివుడు, గొల్లపల్లి విద్యాసాగర్, మిట్టకోల చంద్రమౌళి, వెంకట్‌గౌడ్, పి.ప్రవీణ్, పి.సహజ, ఎలుపుల రమేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

