Sameer Anjaan | పాత పాటలను సర్వనాశనం చేస్తున్నారు.. ‘ధురంధర్’, ‘చౌహాన్’ చిత్రాలను తప్పుబట్టిన సమీర్ అంజన్
Dhurandhar | బాలీవుడ్ సినిమాలలో పాత క్లాసిక్ పాటలను రీక్రియేట్ చేస్తున్న తీరుపై ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత సమీర్ అంజన్ (Sameer Anjaan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బాలీవుడ్ సినిమాలలో పాత క్లాసిక్ పాటలను రీక్రియేట్ చేస్తున్న తీరుపై ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత సమీర్ అంజన్ (Sameer Anjaan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాటల రీమేక్ ట్రెండ్ వల్ల ఒరిగేదేమీ లేదని, కేవలం వాటి ఒరిజినల్ ఫీల్ దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్ చిత్రాల తీరును ఉదాహరణగా చూపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాటల రీక్రియేషన్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) లాంటి సినిమాలు ఈ పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఏకంగా మంచి మ్యూజిక్‌ను తీసుకొచ్చి బ్యాక్‌గ్రౌండ్‌లో పడేసి సర్వనాశనం చేశారు అని అన్నారు.
అలాగే అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న ‘చౌహాన్’ (Chauhaan) సినిమా ట్రైలర్‌ను ప్రస్తావిస్తూ.. “ఆ చిత్రంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్న సమయంలో ‘జుమ్మా చుమ్మా’ పాటను ప్లే చేస్తున్నారు. తుపాకులతో కాల్పులు జరుపుతుంటే అక్కడ అసలు ఆ పాటకు ఉన్న అర్థం ఏంటి? నా తండ్రి ఈ ఇండస్ట్రీని ఏమీ కొనలేదు కదా వెళ్లి ఆపడానికి. కానీ, వీరు ఈ పాటలన్నింటినీ పూర్తిగా పాడుచేసి, చివరికి ఇండస్ట్రీలో ఏమీ మిగలకుండా చేసే వరకు ఈ తంతు ఇలాగే కొనసాగుతుంది” అంటూ తన తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మరియు సంగీత వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

