Monsoon Withdrawal | ఈ నెల 19న రుతుపవనాల తిరోగమనం ఆరంభం.. భారత వాతావరణ కేంద్రం వెల్లడి..!
Monsoon Withdrawal | దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభానికి సమయం దగ్గరపడిందని భారత వాతావరణ కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 19 నుంచి పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Monsoon Withdrawal : దేశంలో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) తిరోగమన ప్రక్రియ ప్రారంభానికి సమయం దగ్గరపడిందని భారత వాతావరణ కేంద్రం (IMD) అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 19 నుంచి పశ్చిమ రాజస్థాన్ (Rajasthan) లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నది. సాధారణంగా సెప్టెంబర్ 17న ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ ఈ ఏడాది రెండు రోజులు ఆలస్యంగా మొదలవుతోంది.
రాజస్థాన్‌లో ఉపసంహరణ ప్రారంభమైనప్పటికీ.. మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టంచేసింది. ముఖ్యంగా 18 నుంచి 20 మధ్య కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా పడింది. సెప్టెంబర్ 13 నాటికి దేశవ్యాప్తంగా 15 శాతం మేర వర్షపాతలోటు నమోదైంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం.
రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 43 శాతం, కర్ణాటకలో 29 శాతం, కేరళలో 27 శాతం మేర వర్షపాత లోటు నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

