వరంగల్ : జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల ఆవరణలో జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యశాల సూపరెండెంట్ డాక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో ధన్వంతరి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు వేదాలలో ఒకటైన ఆయుర్వేదం కోత,కుట్టు లేకుండానే మానవ శరీరంలోని ఋగ్మతలను తొలగించి, దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని అన్నారు.
నేడు భారతదేశ కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందడానికి నాటి నుంచి మనం అవలంభిస్తున్న ఆయుర్వేద సూత్రాలు సైతం ఓ కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే ఔషధాలను ఉపయోగించి నొప్పి లేకుండా చికిత్స అందించడంతో పాటుగా విరిగిన ఎముకలను సైతం అతికించడం మన ఆయుర్వేదానికి ఉన్న మహత్యమని చెప్పారు. ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆయుర్వేదం వైపు చూస్తున్నది. రానున్న రోజుల్లో ఆయుర్వేదం ప్రపంచ దేశాలలో సైతం విస్తరించనున్నదని అమె అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రవీందర్‌గౌడ్, వైద్యశాల అభివృద్ది కమిటీ సభ్యులు డాక్టర్ సాంబమూర్తి, వైద్యులు, కళాశాల అధ్యాపకులు, వైద్యవిద్యార్ధులు, సిబ్బంది పాల్గొన్నారు.