హనుమకొండ(ఐనవోలు): ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Indlu) ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్మాణం చేయాలని ఎంపీవో గోపు రఘుపతిరెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసే కార్యక్రమానికి స్థానిక పంచాయతీ కార్యదర్శి కిశోర్‌తో కలిసి ఆయన హజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించి ప్రణాళిక ప్రకారమే ఇంటి నిర్మాణం చేయాలన్నారు. 400 నుంచి 600 ఎస్ఎఫ్కి మించకూడదన్నారు. ఇండ్ల నిర్మాణ పనులను కూడ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటి సభ్యులు చింత కుమారస్వామి, గడ్డం మురళి, ఎండీ రహీం పాషా, పల్లకొండ బిక్షపతి, హౌసింగ్ ఏఈ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.