మహదేవపూర్, జూన్ 26 : జీపీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీవో ప్రసాద్ ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని ఎడపల్లి గ్రామంలో ఆయన ఆకస్మి కంగా పర్యటిం చారు. జీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు రికార్డులను, రిజిస్టర్లను తనిఖీ చేశారు.
అనంతరం కంపోస్టు ఎరువు తయారీ విధానాన్ని, గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను విస్తృతంగా నాటాలని ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్య పనులు పక్కగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.