హనుమకొండ సబర్బన్, మార్చి 30 : జే చుక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మోటర్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆదివారం దేవాదుల టన్నెల్‌కు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున నీళ్లు ఉబికి వచ్చాయి. రైతుల పంట పొలాలకు నష్టం జరిగింది. దీంతో దేవాదుల మోటర్‌ను నిలిపివేశారు. ప్రారంభించిన మూడు రోజులకే మోటర్ ఆగిపోవడంతో రైతులు నిరాశ చెందారు.
టన్నెల్ నుంచి నీరు లీక్ అయిన ఘటనలో పక్కనే ఉన్న భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు భారీ ప్రమాదం తప్పింది. పైపులైన్ దిమ్మలకు పగుళ్లు ఏర్పడ్డాయి. అవి పగిలి పోయి నట్లయితే 270 గ్రామాలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల కు తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యేది.