ఎల్కతుర్తి, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ 25వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణంలో సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, కార్పోరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దూరదృష్టితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ దళితబంధు లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను సముచిత స్థానంతో చూసి పేదల బాగు కోసం కృషి చేసిందని చెప్పారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ చైర్మన్ రాఘవ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, అమృత్, రవినాయక్, సూర్య, కిరణ్‌వర్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, మునిగడప శేషగిరి, ఎల్తూరి స్వామి, కడారి రాజు, తంగెడ మహేందర్, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, గుండేటి సతీశ్, ఎండీ మదార్, జూపాక జడ్సన్, చిట్టిగౌడ్, దుగ్యాని సమ్మయ్య, వేముల సమ్మయ్య, చదిరం నాగేశ్వర్, కుర్ర సాంబమర్తి, అల్లకొండ రాజు, శ్రీకాంత్‌యాదవ్, అంబాల రాజుకుమార్, కోరె రాజుకుమార్, రాజేశ్వర్‌రావు, రమేశ్, ప్రహ్లాదరావు, ఉట్కూరి కార్తీక్, వినయ్‌రావు, భగవాన్గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.