హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 19: సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈనెల 17న హైదరాబాద్లో జరిగిన రాష్ర్టస్థాయి సీడబ్ల్యూఎస్ఎన్ క్రీడా పోటీలలో హనుమకొండ జిల్లా దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జయకేతనం ఎగురవేశారు. ఈ పోటీల్లో జిల్లా విద్యార్థులు మొత్తం ఇద్దరు బంగారు పతకాలు, 12 మంది వెండి పతకాలు, ముగ్గురు కాంస్య పతకాలు సాధించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి లింగాల గిరిరాజ్గౌడ్ విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కృషి ఇలాగే కొనసాగి భవిష్యత్తులో ఇంకా ఉన్నతస్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఎంవో సుమాదేవి, ఇతర సెక్టోరల్ అధికారులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.