న్యూశాయంపేట, ఫిబ్రవరి 6: వరంగల్ డివిజన్ పరిధిలోని అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని 31 డివిజన్ కార్పొరేటర్ మామిళ్ల రాజు అన్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన శుక్రవారం కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్‌తో కలిసి ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ లోని ప్రభుత్వ స్థలంలో నివాస ముంటున్న అర్హులైన పేదలందరు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టుకోవాలని సూచించారు. ఎన్నికలలో హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణారావు, వార్డు ఆఫీసర్ శిరీష, తదితర పాటు స్థానికులు పాల్గొన్నారు.