తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు.. ఖాళీ బిందెలతో కొండ భీమనపల్లి రహదారిపై ధర్నా
మండలంలోని కొండ భీమనపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 పక్కనే ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ, శనివారం స్థానిక మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ రహదారిపై ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు.
దేవరకొండ రూరల్, ఆగస్టు 1 : మండలంలోని కొండ భీమనపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 పక్కనే ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ, శనివారం స్థానిక మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ రహదారిపై ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కాలనీలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం కింద తాగు నీటిని సరఫరా చేయక చాలా రోజులైందన్నారు.
రోజువారీ అవసరాలకు కూడా నీళ్లు లేకపోవటంతో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ధర్నా కారణంగా రహదారిపై రెండు గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. తాగు నీటి సమస్యే కాకుండా, డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్థంగా ఉందని, కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాయదుర్గారెడ్డి, సిబ్బందితో వచ్చి మహిళలతో మాట్లాడారు. తాగునీరు తదితర సమస్యలపై అధికారులో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో కాలనీ వాసులు ధర్నా విరమించారు.అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించటంతో వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

