హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లోని అల్వాల్ మండలం కౌకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం టీ మురళీకృష్ణమూర్తి జాతీయ స్థాయిలో గౌ రవాన్ని దక్కించుకున్నారు. జాతీ య విద్యాశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అ డ్మినిస్ట్రేషన్ నిర్వహించిన జాతీయ ప్రత్యక్ష ప్ర సార కార్యక్రమంలో పాల్గొన్నారు. లీడింగ్ స్కూల్ ట్రాన్స్ఫర్మెషన్ త్రూ కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంశంపై దేశవ్యాప్తంగా టీచర్లు, విద్యా పరిపాలనాధికారులతో అనుభవాలు పంచుకున్నారు. పదేండ్లుగా ఉత్తమ పద్ధతులు, ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి, హ్యాకథాన్లో సాధించిన విజయాలు ప్రస్తావించారు.