భీమదేవరపల్లి, ఫిబ్రవరి 06 : భీమదేవరపల్లి మండలలోని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్స్‌గా సేవలు అందిస్తున్న మల్లీశ్వరి(Malleswari) ఇగ్నో యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (నర్సింగ్) డిగ్రీ పట్టా అందుకున్నారు. మల్లీశ్వరి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ నందు ఉన్నత విద్యనభ్యసించి, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ద్వారా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా డిగ్రీ పట్టాను అందుకున్నారు.
ఖమ్మం జిల్లా మారుమూల గ్రామం నుంచి ఉద్యోగరీత్యా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నర్స్‌గా విశిష్ట సేవలు అందిస్తూ పలువురి మన్ననలు పొందింది. నర్సింగ్‌లో ఎలాగైనా డిగ్రీ పట్టా పొందాలనే తలంపుతో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి దూరవిద్య ద్వారా బీఎస్సీ (సైన్స్) నర్సింగ్ డిగ్రీ పట్టా అందుకున్నారు. పట్టా అందుకున్న మల్లీశ్వరిని ముల్కనూరు వైద్య సిబ్బంది అభినందించారు.