మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి శివారులో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న నల్లబెలాన్ని గుర్తించి వాహనదారున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకుని రవాణాకు ఉపయోగించే బొలేరో వాహనాన్ని మంగళవారం రాత్రి సీజ్ చేసి సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకుని వాహనడ్రైవర్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి నుంచి మహబూబాబాద్‌కు బొలేరో వాహనంలో తీసుకొచ్చిన నల్లబెల్లాన్ని జమాండ్లపల్లి గ్రామం నుంచి మంగళవారం రాత్రి ఏటి ప్రాంతానికి తరలిస్తుండగా సీసీఎస్ అధికారి డ్రైవర్ పసిగట్టాడు. ఈ విషయాన్ని డ్రైవర్ సీసీఎస్ విభాగంలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని నల్లబెల్లం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.