హనుమకొండ చౌరస్తా, జనవరి 7: డబుల్ పీజీ విద్యార్థులు విశ్వవిద్యాలయ హాస్టళ్లలో ప్రవేశానికి అర్హులు కాదని కేయూ వసతిగృహ సంచాలకులు ఎల్పి రాజ్‌కుమార్ తెలిపారు. గతంలోనే స్పష్టమైన సూచనలు జారీ చేసినప్పటికీ కొంతమంది విద్యార్థులు హాస్టల్ ప్రవేశాలు పొందినట్లు విశ్వవిద్యాలయ అధికారుల దృష్టికి వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ సూచనలను ఉల్లంఘించి హాస్టల్ ప్రవేశం పొందిన అన్ని డబుల్ పీజీ విద్యార్థులు తమ హాస్టల్ ప్రవేశాన్ని 2026 జనవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తప్పనిసరిగా రద్దు చేసుకోవాలన్నారు. నిర్దేశించిన గడువులోగా ఆదేశాలను పాటించనిపక్షంలో హాస్టల్ ప్రవేశం వెంటనే రద్దు చేయబడటంతో పాటు, హాస్టల్ డిపాజిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదని అంతేకాకుండా కాలేజీ ప్రవేశం రద్దుకు చర్యలు కూడా తీసుకోబడతాయని హెచ్చరించారు.