Rudreshwara swamy | శాకాంబరుడిగా వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి
చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఆషాడశుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమి పురస్కరించుకొని ఉదయం రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వర్తించారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 29 : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఆషాడశుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమి పురస్కరించుకొని ఉదయం రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వర్తించారు. అనంతరం గ్రామాల నుంచి కొంత మంది రైతులు సమర్పించిన కూరగాయలు, బీర, టమాట, ఆలు, మునక్కాయ, సొరకాయ, వంకాయ, దొండకాయ, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పుదీనా, గుమ్మడికాయ, క్యారెట్, దోసకాయ, గోరుచిక్కుడుకాయ, బిన్నీసు, ప్రకృతి సహజమైన కూరగాయలు తమ పెరట్లో పండించిన వస్తువులను తీసుకువచ్చి క్వింటాల్ కూరగాయలు సమర్పించడం వలన వాటిని రుద్రేశ్వరస్వామికి దండల రూపంలో అలంకరించారు.
శాకంబరునిగా అలంకరించి పంచసూక్తములతో పూజలు నిర్వహించారు. వర్షాలు ప్రారంభమైనందున నాగల్లుబట్టి దుక్కి దున్నే సమయం వచ్చినందున ఆ పరమేశ్వరుని ప్రీతికరంగా పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడు మేఘాలను వర్షిస్తున్నందున స్వామివారికి కృతజ్ఞతగా రైతులు సమర్పించిన కూరగాయలతో పూజించడం జరిగిందన్నారు. వర్షం పడుతున్నా భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో దేవాదాయ శాఖ మాజీ కమిషనర్ అనిల్‌కుమార్, సతీమణి పద్మజ, వరంగల్ వాసి సంగీత కళాకారిని, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేద పండితులు మణికంఠశర్మ, ప్రణవ్, శ్రవణ్, రుద్రేశ్వర సేవా సమితి సభ్యులు శ్రీనివాస్, జ్యోతి, ఆంజనేయులు, భునగిరి మాధవరావు, వంశీ కూరగాయలు సమర్పించిన వారిలో ఉన్నారు. ఆలయ ఈవో అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

