హనుమకొండ, అక్టోబర్ 12: ప్రపంచంలోనే మహోన్నతతమైన భారత రాజ్యాంగాన్ని మనువాద దుష్టశక్తుల నుంచి కాపాడుకుందామని డాక్టర్ పుచ్చ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు దండు మోహన్, పెరుమాండ్ల కృష్ణస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ విగ్రహ పరిరక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ బండి అశోక్ ఆధ్వర్యంలో జ్ఞానమాలాంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి, భారత రాజ్యాంగంపై దాడిగా పరిగణించాలి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత పోలీసు అధికారులపై పెరుగుతున్న కులవివక్ష, వేధింపులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తున్నాయని, దాని ఫలితంగా హైదరాబాద్ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో మరణించారని, అలాగే హర్యానా ఏడీజీపీవై పురాణ కుమార్(ఐపీఎస్) ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని, ఇలాంటి ఘటనలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పోతుల కొమ్మలు, పానుగంటి లక్ష్మీనారాయణ, శేషాద్రి నాగులు, తిప్పరి రంజిత్, దండ్రే శ్రీనివాస్, వంగేటి రాజమౌళి, కునమల్ల అనిత, సింగారపు రవిప్రసాద్, కదారి కుమార్, గాదె రమేష్, పాడు వుగుల రవి, సదువాల సారంగం, మలం రాజ్‌కుమార్, మేడ యాదగిరి, గరిగె అనిల్, మోగం లింగమూర్తి, పనికల శ్రీనివాస్, పత్రి అశోక్, బన్న వీరస్వామి ఉన్నారు.