Law college | కేయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని దీక్ష చేస్తున్న లా కాలేజీ విద్యార్థుల అరెస్టు
కాకతీయ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, హాస్టల్ డైరెక్టర్లు వెంటనే రాజీనామా చేయాలని ‘లా’ కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 14: కాకతీయ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, హాస్టల్ డైరెక్టర్లు వెంటనే రాజీనామా చేయాలని ‘లా’ కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. హాస్టల్ వసతి కల్పించాలని ప్రజాస్వామ్య పద్ధతుల్లో మంగళవారం సుబేదారిలోని యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణలో ‘లా’ విద్యార్థులు దీక్ష చేపట్టారు. శాంతియుతంగా విద్యార్థులు దీక్ష చేస్తుంటే సుబేదారి పోలీసులు వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తత పరిస్థితి దారి తీసింది. లా విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించలేని వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రాంచంద్రం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్‌కి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లా విద్యార్థులు స్టాలిన్, సందీప్, రాకేష్‌రెడ్డి, అరుణ్, అజయ్, ఈశ్వర్, సాత్విక్, శ్రీను, పవన్, ఆదిత్య మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ ఐదు సంవత్సరాల న్యాయవిద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని, ఐదు సంవత్సరాల పాటు వేల రూపాయల రూం రెంట్లను భరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ అధికారుల అసమర్థ పాలనతో హాస్టల్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అణిచివేత తగదన్నారు. అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం సరైంది కాదన్నారు. హాస్టల్ వసతి కల్పించేవరకు పోరాడుతామని, కేయూ వీసీ, రిజిస్ట్రార్, హాస్టల్ డైరెక్టర్ల విద్యార్థులపై కక్షసాధింపు, నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

