హనుమకొండ చౌరస్తా, జనవరి 7: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌లో ఈనెల 9 వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్(South Zone Inter University Badminton) ఉమెన్స్ పోటీలకు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు.
ఇందులో మంచిర్యాల ఎంఐఎంసీ డిగ్రీ కాలేజీ నుంచి ఎన్.అశ్విత, వరంగల్ కిట్స్ నుంచి ఎస్.శ్రీనిత, పి.లక్ష్మీరెడ్డి, కొత్తగూడెం ఎస్సీడబ్ల్యూడీసీ నుంచి కె.దీక్షిత, ఎస్కే అయేషా కుర్షిద్ ఉన్నారు. వీరికి కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ డిగ్రీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె.సావిత్రి కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.