హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 7: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి సోమవారం తెలంగాణ రాష్ర్ట గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న 24వ స్నాతకోత్సవానికి గవర్నర్‌ను ఉపకులపతి ఆహ్వానించారు. స్నాతకోత్సవాన్ని నవంబర్‌లో నిర్వహిం చేందుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
ఈ సందర్భంగా స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన అంశాలను ఉపకులపతి గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ సూత్రప్రాయ అంగీకారంతో 24వ స్నాతకకోత్సవ నిర్వహణకు మార్గం సుగమమైందని రిజిస్ట్రార్ తెలిపారు. పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ కూడా ఉన్నారు.