హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 18 : వరంగల్ కేంద్రంగా ఇటీవల జరిగిన హెచ్‌సీఏ అంతర్జిల్లా మహిళల క్రికెట్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన వరంగల్ జట్టులో బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌లో రాణించిన కృష్ణవేణి హెచ్‌సీఏ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. నేటి నుంచి జార్ఖండ్‌లో బీసీసీఐ నిర్వహిస్తున్న వన్డే మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) జట్టులో చోటు దక్కింది.
కృష్ణవేణికి వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్, ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక జార్ఖండ్‌లోని రంజీ వేదికపై జరుగుతున్న మ్యాచ్‌లో కూడా బెస్ట్-11 తుది జట్టులో కృష్ణవేణికి చోటు కల్పించారు.