హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25: తెలంగాణ జన సమితి తరఫున వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పన్నాల గోపాల్ రెడ్డికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గోపాల్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా టీచర్స్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ అనేక టీచర్ల సమస్యలను పరిష్కరించారన్నారు. మరోసారి ఎమ్మెల్సీగా గెలిస్తే ఉపాధ్యాయ వర్గానికి న్యాయం జరుగుతుందన్నారు. అలాగే గోపాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచుతుందన్నారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సామాజిక సమస్యల మీద గట్టిగా నిలబడి ప్రజల తరపున గొంతు వినిపించిన గోపాల్ రెడ్డి ఉ నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. అలాంటి వారు కౌన్సిల్లో ఉంటే ఉపాధ్యాయులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో రాజంద్రప్రసాద్, పన్నాల గోవర్ధన్‌రెడ్డి, నాగేశ్వర్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.