హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 4: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్-14 పోటీల్లో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్) క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ఆరు పతకాలు కైవసం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా జూకల్‌లో జరిగిన ఈ పోటీల్లో టి.లలిత్ కృష్ణ 35 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, కే.త్రిశూల్ యాదవ్ 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, వై.సహస్ర 30 కేజీ విభాగంలో స్వర్ణ పతకం, శ్రీనిత్య 39 కేజీ విభాగంలో రజత పతకం, వై.తేజన్ 52 కేజీ విభాగంలో రజత పతకం సాధించారు.
ఈ సందర్భంగా పథకాలు సాధించిన క్రీడాకారులను గురువారం హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ కోచ్‌లు ఎం.జైపాల్, కే.రాజు ఉన్నారు.