హనుమకొండ, ఏప్రిల్ 3 : హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తాత మధు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, స్త్రీ సాధికార సంస్థ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎడమ కృష్ణారెడ్డి, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, గాయత్రి రవి, కొండ దేవయ్య, ఆర్అండ్బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు ఉన్నారు.
చైర్మన్‌కు శుభాకాంక్షలు..
పోచమ్మమైదాన్ : రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, కుడా అడ్వైజరీ కమిటీ మెంబర్ యెలుగం శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, గుం డు పూర్ణచందర్, డాక్టర్ హరిరమాదేవి దంపతులు హైదరాబాద్‌లో ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు.
మట్టెవాడ : రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌కు టీఆర్ఎస్ 29వ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ ఆధ్వర్యంలో నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రడపాక కుమార్, భీంరాజ్, లింగాల రాజేశ్ తదితరులు ఉన్నారు.