హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 16: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వర్తించారు. దేవాలయంలోని ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం నవరసాభిషేకం నిర్వర్తించి స్వామివారిని త్రిముఖ గణపతిగా అలంకరించి గరిక పూజ నిర్వర్తించారు. ఈ పూజా కార్యక్రమంలో ఉభయదాతలుగా మున్నూరుకాపు సంఘం రాష్ర్ట నాయకులు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సోదరులు వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమాదేవి పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై భక్తుల జయజయ ద్వానాల మధ్య, మంగళ వాయిద్యాలతో మహిళలు మంగళహారతులతో స్వామివారిని వాహనసేవ నిర్వర్తించారు.
ఆలయ యాగశాలలో గణపతి నవగ్రహ రుద్ర సహిత జయాధి హోములు నిర్వర్తించారు. సగర సంఘం రాష్ర్ట నాయకులు కంజుల మహేష్ సౌజన్యంతో యాగం నిర్వర్తించారు. అనంతరం వందలది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంకాల భాషా సంస్కృతిక శాఖ, వెలుమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎం.పరమేశ్వర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వర్తించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు పూజారికాలు నిర్వహించారు.