రైస్‌మిల్లర్లు నిర్దేశిత గడువు ప్రకారం కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. డిసెంబర్ 31వ తేదీలోగా వంద శాతం డెలివరీ చేయాలని మిల్లర్లకు డెడ్‌లైన్ పెట్టింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గత యాసంగికి సంబంధించి రైస్‌మిల్లర్లలో ఇంకా ఎవరెన్ని టన్నులు డెలివరీ చేయాలనే వివరాలను సేకరించారు. బాయిల్డ్, రా రైస్ ఎన్ని టన్నులు అనే సమాచారంతో వేర్వేరుగా ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఇంకా సుమారు 58 వేల టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉండగా, ఇందులో 38 వేల టన్నులు రా, 20 వేల టన్నులు బాయిల్డ్ రైస్ ఉన్నట్లు వెల్లడించారు.
వరంగల్, డిసెంబర్ 10(నమస్తేతెలంగాణ) : గత యాసంగిలో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం రైస్‌మిల్లర్లకు కేటాయించింది. ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు సెప్టెంబర్ 30వ తేదీలోగా సీఎంఆర్ వందశాతం డెలి వరీ చేయాల్సి ఉంది. ఎక్కువశాతం సీఎంఆర్ డెలివరీ కాకపోవడంతో గడువును తొలి విడుత అక్టోబర్ 31వరకు, తర్వాత డిసెంబర్ 31 వరకు పొడగించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మిల్లర్లకు అవకాశం కల్పించిం ది. అయినా పలువురు రైస్‌మిల్లర్లు సీఎంఆర్ డెలివరీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు కూడా వందశాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో ప్రభుత్వం ఈ నెల 31లోగా నూరుశాతం డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని కొద్దిరోజుల క్రితం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
డెలివరీ చేయాల్సింది ఎంతంటే..
గత యాసంగికి సంబంధించి రైస్‌మిల్లర్లు ఇంకా సుమారు 58 వేల టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంది. ఇందులో 38 వేల టన్నులు రా, 20 వేల టన్ను లు బాయిల్డ్ రైస్ ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికా రులు వెల్లడించారు. మొత్తం 24 బాయిల్డ్ రైస్‌మిల్లర్ల లో రెండు మిల్లుల యజమానులు మాత్రమే వంద శా తం డెలివరీ చేశారు. మిగతావారు దాదాపు 50వేల ట న్నులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో బాయిల్డ్, రా రైస్ ఫి ఫ్టీ ఫిఫ్టీ ఉంది. మరో 8వేల టన్నుల రా రైస్‌ను జిల్లాలో ని 30కిపైగా రైస్‌మిల్లుల యజమానులు సీఎంఆర్ కిం ద డెలివరీ ఇవ్వాల్సి ఉంది. డిసెంబర్ 31 డెడ్‌లైన్ సమీ పిస్తుండడంతో వంద శాతం డెలివరీ చేయాలని రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో సదరు రైస్‌మిల్లర్లతో సమావే శం నిర్వహించారు. అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, పౌ రసరఫరాల శాఖ జిల్లా అధికారి భవానీలక్ష్మి, పౌరసర ఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్‌రావు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఏ రైస్‌మిల్లర్ ఎన్ని టన్నుల సీఎంఆర్‌ను డెలివరీ చేయాల్సి ఉంది? ఇందు లో ఎఫ్‌సీఐకి, సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు డెలివరీ చేయాల్సింది ఎన్ని టన్నులు? అనే అంశంపై చర్చ జరి గింది. నెలాఖరులోగా సీఎంఆర్ నూరుశాతం డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ మిల్లర్లకు తేల్చి చెప్పారు. ఇకపై ప్రతిరోజూ సమీక్ష జరుపనున్నట్లు తెలిపారు.
రైస్‌మిల్లర్ల మెలిక..
నిబంధనల ప్రకారం బాయిల్డ్ రైస్‌మిల్లర్లు సీఎంఆర్ లో 77 శాతం బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సీఐకి, మిగతా 23 శాతం సీఎంఆర్‌లో 12శాతం ఎఫ్‌సీఐకి, 11శాతం రా రైస్‌ను సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అయితే కొందరు బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సీఐకి 70 శాతం వరకు డెలివరీ చేశారు. ఎక్కువ మంది వెనుకబ డి ఉన్నారు. ప్రస్తుతం అధికారులు ఒత్తిడి పెంచడంతో మొదట ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాల్సి ఉన్న సీఎంఆర్ బాయిల్డ్ రైస్‌ను వంద శాతం పూర్తి చేద్దామని, ముందు గా డెలివరీ చేసే వారికి చాన్స్ ఇవ్వాలని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రతిపాదించారు. దీంతో ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ డెలివరీ చేయడంలో వెనుకబడి ఉన్న మిల్లర్లకు నష్టం జరిగే అవకాశం ఉందని, సదరు మిల్లర్లు బాయిల్డ్ రైస్ కంటే రా రైస్‌ను ఎక్కువ శాతం డెలివరీ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటు న్నారు. సీఎంఆర్ కింద బాయిల్డ్ రైస్ డెలివరీ చేయడం సులభమని, రా రైస్ డెలివరీ చేస్తే ఆశించిన లాభం ఉం డదనే పరిస్థితుల్లో ఈ సమస్య తలెత్తింది. దీనిపై క్లారిటీ ఇవ్వడం అధికారులకు తలనొప్పిగా తయారైంది. మిల్ల ర్లలో కొందరు సీఎంఆర్ కింద రా రైస్ డెలివరీ చేసేం దుకు నిరాసక్తత కనబరుస్తున్నట్లు తెలిసింది.