హనుమకొండ చౌరస్తా, జూన్ 9: కాకతీయ విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట గోపినాథ్ కేయూ అవెన్యూ ప్లాంటేషన్ ఇన్చార్జ్ డైరెక్టర్‌గా మంగళవారం ప్రస్తుత డైరెక్టర్ వెంకటయ్య చేతులమీదుగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
కేయూ పాలక మండల సభ్యులు చిర్ర రాజుగౌడ్, మైక్రో బయాలజీ శాఖాధిపతి సుజాత, వివిధ డిపార్ట్మెంట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సంకినేని వెంకట్, గడ్డం కృష్ణయ్య, ఫిరోజ్, నాగేశ్వర్రావు, రంగారెడ్డి, చంద్రశేఖర్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపినాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.