హనుమకొండ చౌరస్తా, జూన్ 10: ఇంటర్ పాసైన విద్యార్థులకు అంబేద్కర్ మెమోరియల్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో పారా మెడికల్ డిప్లమో కోర్సుల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు ఏరుకంటి అశోక్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్షాద్పాషా తెలిపారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. అన్ని ఉచితంగా ఇచ్చి పూర్తి స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్స్‌లో శిక్షణ ఇచ్చి బోర్డ్ ఎగ్జామ్స్, 100 శాతం ప్లేస్మెంట్స్కల్పించనున్నట్లు తెలిపారు.
జనరల్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు, యూనివర్సిటీ ఫ్రీ, యూనిఫామ్స్, నోట్‌బుక్స్, రికార్డుబుక్స్, ఐడెంటిటీ కార్డు, ఎగ్జామ్ ఫ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీ, పారామెడికల్ కోర్సు లేదా డిగ్రీ కోర్సు ఉచిత అడ్మిషన్ కావాల్సిన విద్యార్థులు, ఒరిజినల్ సర్టిఫికెట్స్, మూడు జిరాక్స్సెట్స్ తీసుకొని రావాలన్నారు. రెండు సంవత్సరాల నుంచి అనగా 2025, 2024, 2023లో ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సంప్రదించాలని, ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత ఓపీ సేవలు, ల్యాబ్ పరీక్షల్లో 50 శాతం డిస్కౌంట్, మందులు 30 శాతం డిస్కౌంట్‌తో సేవలు అందిస్తున్నట్లు, ఇతర వివరాలకు 8886669869, 8886669866, 8897982281, 9849056276 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు వంగాల రాజేంద్రప్రసాద్, చింతా సుష్మ, చింతా హానెస్ట్రాజ్ పాల్గొన్నారు.