హనుమకొండ : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అరాచకపర్వానికి తెరలేపింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేస్తోంది.
ప్రజలకు మధ్యకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. నిరసనలకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి గొంతులు నొక్కే చర్యలకు దిగింది. నిన్న అసెంబ్లీ వద్ద పోలీసుల దాడి, అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.. దానికి నిరసన వర్ధన్నపేట నియోజకవర్గంలో శాంతియుత నిరసనకు పిలుపునిస్తే మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ను నుఐనవోలు మండలం కేంద్రంలో హౌస్ అరెస్ట్ చేశారు.