Manne Krishank | అసెంబ్లీ సమావేశాల వేళ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. వాహనంలో కార్ఖానా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మన్నె క్రిశాంక్ అరెస్టుకు ముందు ఆయన నివాసం వద్ద కార్ఖానా సీఐ అనురాధ వీరంగం సృష్టించారు. ఇంట్లో చిన్న పాప ఉంది.. నా భర్త ఇంట్లో లేడని క్రిశాంక్ సతీమణి సుహాసిని చెప్పినప్పటికీ వినకుండా ఇంట్లోకి వస్తానంటూ సీఐ పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆవేశంతో రెచ్చిపోయిన సీఐ.. క్రిశాంక్ ఇంట్లో పనివాళ్లపై బూతులతో చెలరేగారు. లోపలేస్తా నా కొడకా.. తమాషా చేస్తున్నారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు
ఇంట్లో నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు https://t.co/wLYZ0qk8i7 pic.twitter.com/oN9vBiRTOd
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026