Protest : కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అణిచివేస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడారనే సాకుతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు టీ మధుసూదన్ రావు, అలియాస్ తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నారాయణగూడ పోలీస్‌స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. రేవంత్ సర్కారుకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ ముందు బీఆర్ఎస్ నిరసనలకు సంబంధించి దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Hyderabad, Telangana | BRS leaders protest outside the Narayanguda Police Station after Saifabad Police arrested BRS MLCs T Madhusudhan Rao, alias Tata Madhu, and N Naveen Kumar Reddy, for their alleged remarks against Telangana Legislative Assembly Speaker Gaddam Prasad… https://t.co/I1tRN50kTR pic.twitter.com/574vdjHWIM
— ANI (@ANI) September 8, 2026