– కె. శారద, బోయిన్పల్లి.
‘ప్రమాదం’ చెప్పిరాదు. ఇంట్లో సమస్యలు సహజంగా రెండు విధాలుగా ఉంటాయి. మానసికంగా.. శారీరకంగా! ఇందులో ఎక్కువ శాతం మూలల దోషాల నుంచి వస్తాయి. నైరుతి దోషం.. వ్యక్తుల శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అటు పురుషులను, స్త్రీలను కూడా.. అలాగే, ఇంటిలోని పెద్ద సంతానాన్ని. ఇక పశ్చిమ-నైరుతి పెరిగినప్పుడు పురుషుల మీద, దక్షిణ-నైరుతి పెరిగితే స్త్రీలకు దీర్ఘరోగాలు, బలవంతమైన మరణాలు, ఆక్సిడెంట్లు జరగడం ఎక్కువగా ఉంటుంది.
తెలియకుండా కొందరు నైరుతి పెంపుతో గదులు కడుతుంటారు. నైరుతి ద్వారాలు.. అవి ఇంటికి ఉన్నా, కాంపౌండ్‌కు ఉన్నా ఎంతో నష్టాన్ని తెచ్చి పెడతాయి. ఆగ్నేయ, వాయవ్యాలు మనోగతమైన సమస్యలు తెస్తాయి. వాయవ్యం పెరిగినా, వాయవ్యం మూతపడినా.. ఇంటి గృహస్థురాలు చాలా వేదన అనుభవిస్తుంది. స్త్రీలు దురభ్యాసాలకు లోనవుతారు. ఇవన్నీ ఎవరూ కోరుకోరు. కానీ, ఆయా వ్యక్తుల మనస్తత్వాలు అలాంటి దోషాలకు పురికొల్పుతాయి. లేదా అలాంటి ఇళ్లను ఇష్టపడేలా చేస్తాయి. అందుకే, గృహంలో తెలుసుకొని ఉండాలి. తగు మార్పులు చేసి నివసించాలి.
– డి. శ్రీధర్, పరిగి.
ఇండ్లు సరే.. మరి పెండ్లి మాటేమిటి? గృహం-జీవనం అనేది విడదీయరానిది. ఆయా గృహాలు, ఆయా కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఏర్పడుతుంటాయి. మనం ఒకే కాలనీలో ఒకేరకం ఇండ్లల్లో ఉన్నా.. లోపల ఎన్నో వ్యక్తిగత మార్పులు జరుగుతాయి. అలా కవల పిల్లలు ఒకేరకమైన గృహాలలో ఉండాలనేది లేదు.

ఎవరి ఇష్టం ఎలా ఉంటే.. అలా కట్టుకోవచ్చు. అంతేకాదు.. ఏ వీధి స్థలంలో, ఎవరు, ఎప్పుడు, ఎంత పెద్ద గృహం కడతారో తెలియదు. ఇల్లు కట్టి, అందులో నివసించడం కూడా అంత సులభంగా జరగదు. ప్రకృతి ప్రణాళిక ఎవరికి ఎలా చేస్తుందో తెలియదు. మీరు మీకు నచ్చిన గృహాన్ని చక్కగా కట్టుకోండి. ఇల్లు ఎక్కడ, ఎంత కట్టారు అని కాకుండా.. కట్టిన ఇల్లు ‘శాస్త్రబద్ధంగా’ ఉండాలన్నది మాత్రం సత్యం.
– వి. రమేశ్, గచ్చిబౌలి.
గృహం బయట ఉండే మెట్ల కింద టాయిలెట్ ఉండకూడదు. కానీ, ఇంట్లోని మెట్ల కింద ఉండొచ్చు. సాధారణంగా డూప్లెక్స్ ఇండ్లల్లో మెట్లు పడమర లేదా దక్షిణంలో ఇచ్చినప్పుడు మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది. ఈ రోజుల్లో విల్లాలు కడుతున్నారు. కానీ, దక్షిణంలో వచ్చే మెట్లు ల్యాండింగ్ ఎత్తు చాలా తక్కువగా ఉంచుతున్నారు. దీంతో, ఆ ల్యాండింగ్ కింద మనిషి నిలబడే అవకాశం ఉండదు.

అందుకని అక్కడ వాడుకోవడానికి వీలుగా ఫ్లోరింగ్‌ను రెండు అడుగులు కిందికి చేస్తున్నారు. అలా మెట్ల కింద టాయిలెట్ కట్టి ఇస్తున్నారు. అలాంటి విధానం మంచిదికాదు. కాబట్టి, జాగ్రత్తగా చూడాలి. ఇంటి ఫ్లోరింగ్ కన్నా తగ్గి ఉండేలా టాయిలెట్ కట్టవద్దు. అలాంటివి తొలగించి, ఫ్లోరింగ్ పెంచాలి. అక్కడ టాయిలెట్ రాదు కాబట్టి, కమౌడ్ (తొట్టి)ని తొలగించి.. స్టోర్‌గా వాడుకోవాలి.
– కె. సరస్వతి, ఉప్పల్.
మీ ఇంటి ఇలవేల్పు కోసం గొప్పగా గుడి కట్టుకోవడంలో ఏ ఇబ్బందీ ఉండదు. కొందరు ఈ కాలంలో ఇంటిపైన ఒక కోవెలను తయారు చేసుకుంటున్నారు. తూర్పు ముఖంగా.. ఏక అంతస్తు గుడిని కట్టుకోండి. దానికి తగిన విధంగా మంటపం నిర్మించండి. అయితే, ఒక అర్చకుడిని ఏర్పాటు చేసి.. ప్రతిరోజూ శాస్త్ర పద్ధతిలో నిత్యార్చనలు, ధూప-దీప నైవేద్యాలు జరిపించాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదు.

అలా శోభాయమానంగా కోవెల ఏర్పాటు చేశాక.. పైన ఎలాంటి ఇతర గదులు లేకుండా చూసుకోవాలి. సరైన విధంగా ప్లాన్ చేసుకోవాలి. సిమెంట్ తొట్లలో మొక్కలు పెంచి, చక్కని వాతావరణం ఏర్పాటు చేసుకోవచ్చు. స్వామివారిని తూర్పు ముఖంగానే ఉండేలా ఏర్పాటు చేయాలి. మీరు ఎలా నిర్మించాలని అనుకుంటున్నారో.. అలా ముందుగా ఒక నక్ష తయారు చేసి, సరైన విధంగా గుడి నిర్మాణం చేయాలి. అది గృహానికి సంబంధించినది కాబట్టి, తెలిసిన వారిచేత చూపించుకోవాలి. మీ సొంత నిర్ణయాలు వద్దు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143