చాలామంది ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను రాత్రిపూట చార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తారు. దానివల్ల బ్యాటరీ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అధునాతన స్మార్ట్ఫోన్లలో భద్రతా ఫీచర్లు ఉన్నా.. బ్యాటరీ జీవితకాలం మాత్రం తగ్గిపోతుంది. అదే.. బ్యాటరీ 100 శాతం నిండిన తర్వాత చార్జర్ పిన్ దానంతట అదే ఊడిపోతే! వినడానికి వింతగా ఉన్నా.. Elebase Smart Charger Adapterతో అది సాధ్యమే! ఈ చార్జర్ అడాప్టర్ ప్రత్యేకమైన మెకానిజంతో తయారైంది.
బ్యాటరీ పూర్తిగా నిండిన తర్వాత ఫిజికల్ పాప్-అవుట్, ఆటో-డిస్కనెక్ట్ ద్వారా చార్జర్ పిన్ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచి ఆటోమేటిక్‌గా విడిపోతుంది. ఓవర్ చార్జింగ్, ఓవర్ హీటింగ్తోపాటు షార్ట్ సర్క్యూట్ల నుంచి బ్యాటరీలను కాపాడుతుంది. ఇందులోని ప్రత్యేక సాంకేతికత బ్యాటరీ 95 శాతానికి చేరిన వెంటనే.. ట్రికిల్ చార్జింగ్ మోడ్‌కు మారిపోతుంది. బ్యాటరీ 100 శాతం కాగానే పూర్తిగా ఆగిపోతుంది. ఫోన్, ల్యాప్‌టాప్‌లను చార్జర్‌కు కనెక్ట్ చేసి.. మర్చిపోయే అలవాటు ఉన్నవారికి ఈ పరికరం ఓ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ధర: రూ.999
దొరుకుచోటు: అమెజాన్

ప్రయాణాలు చేసేటప్పుడు ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్ లాంటి వేర్వేరు పరికరాల కోసం రకరకాల కేబుళ్లు, కనెక్టర్లు తీసుకెళ్లడం కష్టం. ఈ సమస్యను నివారించేందుకు పోర్ట్రానిక్స్ సంస్థ Snapcase 6 ను ఒక చిన్న కేస్ రూపంలో తీసుకొచ్చింది. ఇదో ‘ఆల్-ఇన్-వన్’ మల్టీఫంక్షనల్ కేబుల్ కిట్. ఇందులో 60W వరకు అవుట్‌పుట్ అందించే టైప్-సి టూ టైప్-సి కేబుల్ ఉంటుంది. స్మార్ట్ఫోన్లతోపాటు ట్యాబ్లెట్లు, టైప్-సి సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్‌లను వేగంగా చార్జ్ చేస్తుంది. వివిధ రకాల పరికరాలను కనెక్ట్ చేయడానికి ఇందులో కన్వర్షన్ అడాప్టర్లు కూడా వస్తాయి.
ఇందులో ప్రత్యేకమైన ఆకర్షణ.. ఇన్‌బిల్ట్ వైర్లెస్ వాచ్ చార్జింగ్ మాడ్యూల్. దీని ద్వారా ప్రత్యేక కేబుల్ అవసరం లేకుండానే ఆపిల్ వాచ్ లాంటి స్మార్ట్‌వాచ్‌లను సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. కేవలం చార్జింగ్ కోసమే కాకుండా.. డేటాను బదిలీ చేయడానికీ పనికొస్తుంది. ప్రయాణాల్లో సిమ్ కార్డులు పోకుండా.. ఇందులోనే నానో సిమ్, మైక్రో ఎస్డీ కార్డులను దాచుకోవడానికి ప్రత్యేక స్లాట్లు, సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంటాయి. ఈ కేస్‌ను హ్యాండ్స్-ఫ్రీ మొబైల్ హోల్డర్, స్టాండ్‌గానూ వాడుకోవచ్చు.
ధర: రూ.749
దొరుకుచోటు: అమెజాన్

ప్రయాణాలు, ఔట్‌డోర్ క్యాంపింగ్‌లు ఎక్కువగా చేస్తుంటారా? క్యాంపింగ్‌లో ఎయిర్ మ్యాట్రెస్, స్లీపింగ్ ప్యాడ్లు, స్విమ్మింగ్ పూల్ ట్యూబ్లలో గాలి నింపడానికి అవస్థలు పడుతున్నారా? అయితే, FLEXTAILGEAR Tiny Pumpపై ఓ లుక్కేయాల్సిందే! ఈ అల్ట్రా-కాంపాక్ట్ పోర్టబుల్ ఎయిర్ పంప్.. అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటుంది. గాలి నింపడానికే కాదు.. క్యాంపింగ్ పూర్తయిన తర్వాత మ్యాట్రెస్, ప్యాడ్ల నుంచి గాలిని బయటికి తీయడానికీ ఉపయోగపడుతుంది.
పరిమాణంలో చిన్నదైనప్పటికీ, అధిక పీడనంతో నిమిషానికి 180 లీటర్ల గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. ఒక సింగిల్ ఎయిర్ మ్యాట్రెస్‌ను రెండు నిమిషాల్లోనే నింపేస్తుంది. ఇందులో 1300 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే.. సుమారు 15 నిమిషాల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. తక్కువ బరువు, బ్యాక్ప్యాక్లోనూ సులభంగా తీసుకెళ్లడానికి ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది.
ధర: రూ.9,032
దొరుకుచోటు: అమెజాన్

రాత్రిపూట హైకింగ్, క్యాంపింగ్ చేసేవారికి, రెస్క్యూ, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేసేవారికి ఉపయోగపడేలా అత్యంత శక్తిమంతమైన ప్రీమియం ఫ్లాష్‌లైట్ అందుబాటులోకి వచ్చింది. LOOP Multi functional MAO Flat LED Flashlight.. సంప్రదాయ టార్చ్లైట్లకు భిన్నంగా పనిచేస్తుంది. పరిమాణంలో చిన్నదైనప్పటికీ.. గరిష్ఠంగా 4360 ల్యూమెన్స్ వరకు శక్తిమంతమైన టర్బో బ్రైట్నెస్ను అందిస్తుంది. కొన్ని వందల మీటర్ల దూరం వరకు చిమ్మచీకటిని కూడా పట్టపగలుగా మార్చేస్తుంది. అల్యూమినియంతో తయారైన ఈ టార్చ్‌లైట్ బాడీపై సిరామిక్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది.
దీనివల్ల ఎన్నేండ్లు వాడినా.. తుప్పు పట్టకుండా, గీతలు పడకుండా ఉంటుంది. అవసరానికి తగినట్టుగా మార్చుకోవడానికి ఇందులో మల్టీ-ఫంక్షనల్ లైటింగ్ మోడ్స్ ఉంటాయి. ఇది హై-కెపాసిటీ రీచార్జబుల్ లిథియం బ్యాటరీతో నడుస్తుంది. ఈ బ్యాటరీని టైప్-సి పోర్ట్ ద్వారా వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. జేబులో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఆన్ కాకుండా ఉండేందుకు ‘లాక్-అవుట్ మోడ్’ ఉంటుంది. ఇక ఇందులో అధునాతన థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నది. ఇది ఎక్కువ లైటింగ్‌తో పనిచేసినప్పుడు వచ్చే విపరీతమైన వేడిని నియంత్రించి, ఎల్ఈడీ బల్బులు పాడవకుండా కాపాడుతుంది.
ధర: రూ. 21,764
దొరుకుచోటు: అమెజాన్