ములుగు : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లో ఓ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామంలోచోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పోర్ల వీరయ్య(62) అనే రైతు మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో తన పొలానికి నీరు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
ఈ క్రమంలో అతని పొలంలోనే విద్యుత్ తీగ తెగి భూమిపై పడడంతో దానిని గ్రహించని వీరయ్య వైర్లు తొక్కడంతో అక్కడికక్కడే విద్యుత్ షాక్తో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వీరయ్య మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. నిరుపేద కుటుంబానికి చెందిన వీరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పలువురు కోరారు.