హైదరాబాద్ : హనుమకొండ పట్టణ నాయీ బ్రాహ్మణ పరస్పర సహాయక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో సమావేశమై ఏకగ్రీవంగా పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. హనుమకొండ టౌన్ అధ్యక్షుడిగా జంపాల ప్రభాకర్‌ను ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సింగరపు శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా యాదగిరి గురుమూర్తి, కోశాధికారిగా సమ్మెట రవీందర్, ఉపాధ్యక్షుడిగా శ్రీరాముల వెంకటేష్‌ను ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో దుబ్బాకుల సారంగపాణి, శ్రీరాముల సుదర్శన్, సముద్రాల యాదగిరి, ఎలకంటి శ్రీనివాస్, జంపాల ఐలయ్య రాగిరి సాయికిరణ్, ముత్యాల వీరేంద్రనాథ్, మొగిలిచర్ల నాగరాజు, సూత్రపు కిరణ్, పుట్టపాక పవన్, చెన్న రవీందర్, నడిగోటి ప్రభాకర్, తక్కలపల్లి ప్రవీణ్, మురారి తిరుపతి, పుట్టపాక రాజేందర్, ముద్రాల రంజిత్, కొత్తపల్లి సునీల్, సమ్మెట మహేందర్, సముద్రాల వెంకటేష్, తక్కలపల్లి గంగాధర్, చందర్లపాటి మణికుమార్, దుబ్బాకుల సారంగపాణి, సముద్రాల యాదగిరి , జంపాల ఐలయ్య ఎలక్షన్ కమిటీ కన్వీనర్ శ్రీరాముల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.