హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11: గోవాలో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్సైన్స్అంతర్జాతీయ సెమినార్‌కు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్, నిట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ రవికుమార్ వద్ద ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్డీ చేస్తున్న అశోక్‌కుమార్ గోవాలో జరిగే అంతర్జాతీయ సెమినార్లో ‘ది లైఫ్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ ఠాకూర్దేవ్సింగ్’ పై పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు.
ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ను గైడ్ రవికుమార్, ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్‌ఖాన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, కోచ్‌లు అభినందించారు.