హనుమకొండ చౌరస్తా, మార్చి 31: హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోత్ అశోక్‌కుమార్‌కు తెలంగాణ రాష్ర్ట స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు స్పోర్ట్స్అథారిటీ ఎండీ సోని బాలాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రతిరాంతండాకు చెందిన అశోక్‌కుమార్ 2011లో స్పోర్ట్స్ అథారిటీలో రెజ్లింగ్ కోచ్‌గా నియముక్తులై కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో డీవైఎస్వోగా పనిచేశారు. గత ఆరేళ్ల క్రితం హనుమకొండ జిల్లాకు బదిలీపై వచ్చారు. జిల్లాలో కోట్లాది రూపాయల వ్యయంతో విస్తృతంగా క్రీడామౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టారు.
రాష్ర్టంలోని హనుమకొండ జిల్లాలో క్రీడలపరంగా ముందు వరుసలో నిలిపారు. అశోక్ కుమార్‌కు పదోన్నతి లభించడం పట్ల ఓలంపిక్ అసిసోసయేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజిజ్ఖాన్, పలు క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, రమేష్‌రెడ్డి, శ్యామల పవన్, మహమ్మద్ కరీం, తోట శ్యాం, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ బాధ్యులు రాజ్‌కుమార్, సుధాకర్, రాజు, షేక్ రియాజ్, మహేష్, దేవేందర్‌తో పాటు స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌లు అభినందించారు.