స్లీప్ హైజీన్ పాటించండి
నిద్రలో ఉన్నప్పుడు మెదడులో, శరీరంలో అనేక జీవ రసాయన ప్రక్రియలు జరుగుతాయి. ఈ చర్యలు ఎదుగుదలను, శరీర అవయవాల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భావోద్వేగాలను నిద్ర ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
నిద్రలో ఉన్నప్పుడు మెదడులో, శరీరంలో అనేక జీవ రసాయన ప్రక్రియలు జరుగుతాయి. ఈ చర్యలు ఎదుగుదలను, శరీర అవయవాల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భావోద్వేగాలను నిద్ర ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. నేర్చుకున్నవన్నీ మెదడు సరిగా అర్థం చేసుకుని జ్ఞాపకంగా నమోదు చేసుకుంటుంది. వయసుకు తగ్గట్టుగా నిద్ర లేకపోతే.. నిద్రలో జరిగే ప్రక్రియలన్నీ సజావుగా సాగవు.
పిల్లలు ఎక్కువ సమయం, పెద్దలు తక్కువ సమయం నిద్ర పోతారు. సంవత్సరంలోపు పిల్లలు రోజులో పన్నెండు నుంచి పదహారు గంటలు నిద్రపోతారు. రెండు నుంచి అయిదేళ్ల లోపు పిల్లలు పదకొండు గంటలు, ఆరు నుంచి పన్నెండేళ్ల మధ్య వయసు పిల్లలు తొమ్మిది నుంచి పది గంటలు నిద్రపోతారు. ఆపై వయసు వాళ్లు రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతే సరిపోతుంది. ఒకే వయసు పిల్లలందరూ కచ్చితంగా ఒకే సమయం నిద్రపోరు. కొంత తేడా ఉంటుంది. నిద్ర సరిపోకపోతే మత్తుగా ఉంటుంది. అప్రమత్తత ఉండదు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. హైపర్యాక్టివ్గా ఉంటారు. చేయకూడదనే పనులు చేస్తుంటారు.
కొంతమంది అనారోగ్య సమస్యల వల్ల నిద్ర సమస్యలు ఎదుర్కొంటారు. నిద్రపోవాలని ఉన్నా ఒక్కోసారి టాన్సిల్స్ పెద్దగా ఉండి ఇబ్బంది పెడతాయి. గురక పెడతారు. కొంతమంది పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేస్తారు. హారర్ సినిమాలు, కలవరపెట్టే వీడియోలు చూస్తే ఇలా నిద్రాభంగం అవుతుంది. చెడు కలల వల్ల గాఢమైన నిద్రలోకి జారుకోరు. స్లీప్ క్వాలిటీ తగ్గకుండా ఉండాలంటే ‘స్లీప్ హైజీన్’ మెయింటెయిన్ చేయాలి.
మంచి నిద్రకు మేలైన చిట్కాలు
- ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవాలి. మార్పు ఉంటే అర్ధగంట ముందు, అర్ధగంట ఆలస్యం ఉండాలి. అంతకు మించకూడదు. వీకెండ్స్‌లో అర్ధరాత్రి దాకా ప్రయాణాలు, వినోదాలకు సమయం కేటాయించవద్దు. రోజూ ఒకే సమయానికి పడుకోవాలి.
- పడక గదిని చీకటిగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలకు కర్టెన్లు పెట్టుకోవాలి. పడక గదిని నిద్రకు మాత్రమే వాడుకోవాలి. చదువుకోవడానికి వాడకూడదు. పుస్తకాలు, ఆట బొమ్మలు ఉండకూడదు. పడకగదిలోకి వస్తే బ్రెయిన్ వాటిని గుర్తిస్తుంది. కాబట్టి పిల్లలు అంత త్వరగా నిద్రపోరు.
- పడుకోవడానికి ముందు స్క్రీన్ చూడకూడదు. స్క్రీన్ చూసినప్పుడు మెదడు బాగా ఉత్తేజితమవుతుంది. అంత ఉత్తేజంగా ఉన్నప్పుడు మంచమెక్కినా నిద్రలోకి జారుకోకుండా మెదడు ఆలోచిస్తూ ఉంటుంది. పడుకోవడానికి అర్ధగంట ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్ చూడకూదు.
- పడుకునే ముందు మసాలా ఆహారం, కాఫీలు, టీలు తీసుకోవద్దు. కూల్‌డ్రింక్స్ తాగొద్దు.
- ఆకలి లేకుండా ఉంటే నిద్ర బాగా పడుతుంది. కానీ, కొన్ని ఆహారాలు తింటే, తాగితే బాగా నిద్రపడుతుందనేది అవాస్తవం.
- నిద్రకు మందులేమీ అవసరం లేదు. స్లీప్ హైజీన్ పాటిస్తే సరిపోతుంది. ఏవైనా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే నిద్ర కోసం వైద్యులు సూచించిన మందులు వాడొచ్చు.
- రోజూ పడుకునేటప్పుడు ఇబ్బంది పడినా, నిద్రలో చాలాసార్లు డిస్టర్బ్ అయి లేచినా, గురక పెట్టినా, స్కూల్లో నిద్రపోతున్నాడని ఫిర్యాదులు వచ్చినా డాక్టర్‌కు చూపించడం మంచిది.
– డాక్టర్ రమ్య బండి కన్సల్టెంట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

