ఎదులాపురం/నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 3 : సర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన, పూర్తి పారదర్శకతతో చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఎస్ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) ప్రక్రియల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటలైజేషన్ ప్రక్రియలో పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తతో పనులు పూర్తి చేయాలని సూచించారు.
అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉంటే, వారందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా హేతుబద్ధీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి చెందిన ఓటర్లను సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేరొన్నారు. ఆదిలాబాద్ వీసీలో కలెక్టర్ రాజర్షి షా, రెవెన్యూ అదనపు కలెక్టర్ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా పాల్గొన్నారు. అలాగే నిర్మల్‌లో కలెక్టర్ భవేశ్‌మిశ్రా, రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్ పాల్గొన్నారు.