హనుమకొండ చౌరస్తా, జూలై 29: కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మహాకవి డాక్టర్ సి. నారాయణరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ మామిడి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, పాలక మండలి సభ్యులు చిర్ర రాజు, కర్రే సదాశివ్, రాజనీతి శాస్త్ర శాఖ అధ్యక్షులు గడ్డం కృష్ణయ్య, సంకినేని వెంకటయ్య, సత్యనారాయణ, అన్నపూర్ణ, బానోత్ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. తెలుగు విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరై సినారె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అలాగే వడ్డేపల్లిలోని పింగిళి కాలేజీలో సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి సినారె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాలేజీ ఐక్యూఏసి కో-ఆర్డినేటర్ సురేష్‌బాబు, అధ్యాపకులు ఆర్.లక్ష్మీకాంతం, రామా రత్నమాల, బి.సునీత, రాజేశ్వరి, ఉదయశ్రీ, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలో విజేతలైన భార్గవి, సాయిలత, అక్షిత, మనీషాలకు బహుమతులు అందించారు.