Danny Movie | రా అండ్ రస్టిక్ గా ఆశిష్ గాంధీ ‘డానీ’.. అంచనాలు పెంచుతున్న ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్!
Danny Movie | టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించేందుకు మరో రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది.
Danny Movie | టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించేందుకు మరో రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఆశిష్ గాంధీ హీరోగా, కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డానీ’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ స్ట్రైక్’ టీజర్ తాజాగా విడుదల కాగా, సినిమాపై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి.
టీజర్ ఆరంభంలోనే “నువ్వు బీచ్‌కి ఎప్పుడూ ఒంటరిగా వస్తావా?” అని హీరోయిన్ అడిగే ప్రశ్నకు, హీరో చెప్పే బోల్డ్ ఆన్సర్ యూత్ ఆడియెన్స్‌ను ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేసేలా ఉంది. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, థ్రిల్ గొలిపే యాక్షన్ సన్నివేశాలకు కూడా పెద్ద పీఠ వేసినట్లు స్పష్టమవుతోంది. బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విజువల్స్, నటీనటుల గ్లామర్ అప్పీల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ, హీరో ఆశిష్ గాంధీ కాంబినేషన్లో వచ్చిన ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి ‘డానీ’తో వస్తుండటంతో సినీ వర్గాల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టెక్నికల్ పరంగా కూడా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్ అత్యున్నత ప్రమాణాలతో నిలిచింది. ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా, కలర్ ఫుల్‌గా ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా బీజీఎం అదరగొట్టింది. ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మణికాంత్ ఎడిటర్‌గా, రామ్ సుంకర, కళ్యాణ్‌జీ గోగణ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా వర్క్ చేస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అక్టోబర్ నెలలో ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ ‘డానీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

