హనుమకొండ చౌరస్తా, జనవరి 13: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం రీకౌంటింగ్‌కు జనవరి 23 వరకు గడువు ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి లింగాల వెంకటగిరి రాజ్‌గౌడ్ తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్లో నిర్వహించగా వెబ్ మెమోలను జనవరి 13 నుంచి www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్దులకు ఆయన సూచించారు. మార్కుల విషయమై ఎవరైనా రీకౌంటింగ్ కోసం ఈనెల 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వెంకటగిరి రాజ్‌గౌడ్ వెల్లడించారు.