హనుమకొండ చౌరస్తా, జులై 5: ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఓపెన్ టు ఆల్ చదరంగం ఎంపిక పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సుమారు 112 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. మొదటి మూడు రౌండ్లు ముగిసేసరికి ముందంజలో క్రీడాకారులు దారా సాయి వివాస్, ఏ.ఆద్య, రిత్విక్ గండు, కొమురవెల్లి వివేక్ ఉన్నట్లు తెలిపారు.